రాధామాధవ సంగీత నృత్య కళాశాల
రాధామాధవ సంగీత నృత్య కళాశాల 1989 సెప్టెంబర్ 1వ తేదీన నాట్యాచార్య శ్రీ షేక్ ఖలీల్ గారి ఆలోచన లోంచి పుట్టిన కళానిలయం. అప్పటివరకు గుంటూరు నగరంలో శాస్త్రీయ నృత్యాన్ని సాంప్రదాయ పద్ధతిలో భరతనాట్యాన్ని శ్రీమతి భద్రగిరి సీతగారు, కూచిపూడి నృత్యాన్ని శ్రీ చింతా ఆదినారాయణ శర్మ గారు బోధిస్తున్న కాలంలో వీరి ఇద్దరి వద్ద ఈ రెండు శాస్త్రీయ నృత్యాలను అభ్యాసన చేసి తనదైన శైలిలో శాస్త్రీయతను తప్పకుండా ఆధునికతను విడువకుండా సరికొత్త నృత్యాంశాలను రూపకల్పన చేసి గురువుల మన్ననలతోపాటు గుంటూరు పుర ప్రజల ఆదరాభిమానాలను కుడా చూరగొన్న అభినవ నృత్యకళా విప్లవకారుడు నాట్యాచార్య శ్రీ షేక్ ఖలీల్ గారు.
కళలకు కులం లేదు,
ప్రతిభకు మతం లేదు,
కృషి వృధా పోదు
అనే ఆలోచనతో ఒక మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన తాను కళల పై మక్కువ తో నృత్యాన్ని అభ్యసించడమే కాక, ఆ వృత్తిలో స్థిరపడాలనే దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. 20 మంది విద్యార్ధులతో మొదలైన రాధామాధవ ప్రయాణం నేటికి కొన్ని వందల మంది నృత్య కళాకారులను పదుల సంఖ్యలో నాత్యచార్యులను తాయారు చెయగలిగింది.
ప్రస్తుతం, దాదాపు 150 మంది విద్యార్ధులతో నిత్యం నృత్యోపాసన చేసే నాట్య దేవాలయంగా రాదామాధవను ఉపమానించవచ్చు.
రాధామాధవ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనే కాకుండా బ్రునై, మలేషియా వంటి విదేశాలలో కూడా ప్రదర్సనలు ఇవ్వటం జరిగింది. రాధామాధవ విద్యార్ధులకు మూడు మార్లు Guinness Book of World Records నందు స్థానం లభించింది. వివిధ సాంస్కృతిక సంస్థలు నిర్వహించే పోటీలలో కొన్ని వందల ప్రధమ, ద్వితీయ బహుమతులు మరియు పలు అవార్డులను పొందటం రాధామాధవ ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్య్వం నిర్వహించే శాస్త్రీయ నృత్య పరీక్షల (Classical Dance Examinations) నందు అనేక మంది విద్యార్ధులచే Certificate, Diploma మరియు M.A. Kuchipudi పరిక్షల నందు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైనవారు కోకొల్లలు.
గుంటూరు నగరంలో ప్రస్తుతం 3 ప్రదేశాలలో తరగతులను నిర్వహించడమే కాక ఆసక్తి గల విద్యార్ధులకు ఇంటివద్దనే నృత్యాన్ని బోధిస్తున్న ఏకైక నాట్యాలయం రాధామధవ.

No comments:
Post a Comment